#NiharikaKonidela : ఆయ‌న కోసం న‌టించ‌డం మానేశా

భ‌ర్త వ‌ద్ద‌న్నందుకే ఈ నిర్ణ‌యం

Niharika Konidela : మెగా ఫ్యామిలీకి చెందిన నాగ‌బాబు కూతురు కొణిదెల నిహారిక(Niharika Konidela) ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా ఆమె త‌న మ‌న‌సులోని అభిప్రాయాల‌ను పంచుకున్నారు.

అల్ల‌రిలోనే కాదు న‌ట‌న‌లో కూడా ఆమె త‌న‌దైన ముద్ర వేసుకున్నారు. న‌టిగా ఆక‌ట్టుకుంది. నిర్మాత‌గా రాణిస్తోంది. ఇదే స‌మ‌యంలో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. యాక్ట‌ర్ గా త‌న‌కు చిరంజీవి గారే స్ఫూర్తి అని చెప్పింది.

అయితే హీరోయిన్ల‌కు పెళ్లిళ్లు అయినా ఏం మార‌డం లేద‌న్నారు. అందుకు స‌మంత‌ను చూస్తే తెలుస్తుంద‌న్నారు. ఇక త‌న భ‌ర్త చైత‌న్య గురించి కీల‌క కామెంట్ చేసింది.

మా ఆయ‌న‌కు తానంటే చ‌చ్చేంత ప్రేమ అని చెప్పింది. కానీ త‌న‌కు తాను సినిమాల్లో న‌టించ‌డం ఇష్టం లేద‌ని స్ప‌ష్టం చేసింది. అందుకే సినిమాల్లో న‌టించ‌డం మానేశాన‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టింది.

సినిమాలు బంద్ చేశాక ఏదైనా చేద్దామ‌ని వినూత్నంగా ఆలోచించ‌డం మొద‌లు పెట్టా. దీంతో టీచ్ ఫ‌ర్ ఇండియా అనే కార్య‌క్ర‌మంలో పిల్ల‌ల‌కు పాఠాలు చెప్పానని తెలిపింది.

కానీ మూవీస్ పై ఉన్న ప్రేమ‌ను చంపుకోలేక పోయాన‌ని తెలిపింది. ఇందులో భాగంగా ప్రొడ‌క్ష‌న్ స్టార్ట్ చేశాన‌ని చెప్పింది. ముద్ద‌ప‌ప్పు ఆవ కాయ్ , నాన్న కూచీల‌తో పాటు యంగ్ స్ట‌ర్స్ తో క‌లిసి స్నేహంపై ఓ వెబ్ సీరీస్ తీశాన‌ని వెల్ల‌డించింది నిహారిక కొణిదెల‌(Niharika Konidela).

ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అనే సీరీస్ ఇప్ప‌టికే విడుద‌లైంది. యూట్యూబ‌ర్ నిఖిల్ తో క‌లిసి ఓ సూప‌ర్ వెబ్ సీరీస్ లో న‌టిస్తున్నాన్న విష‌యంపై మాత్రం ఆమె క్లారిటీ ఇవ్వ‌లేదు.

Also Read : ఆక‌ట్టుకున్న చైతూ ‘స్టైల్ స్మైల్’

Leave A Reply

Your Email Id will not be published!