#NawabMalik : కోర్టు క‌న్నెర్ర‌తో వెన‌క్కి త‌గ్గిన మాలిక్

డిసెంబర్ 9 వ‌ర‌కు కామెంట్స్ చేయ‌ను

Nawab Malik  : మ‌హారాష్ట్ర మంత్రి న‌వాబ్ మాలిక్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఎన్సీబీ జోన‌ల్ ఆఫీస‌ర్ స‌మీర్ వాంఖ‌డేతో పాటు ఆయ‌న కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ వ‌చ్చారు. స‌మీర్ వాంఖ‌డే కోర్టును ఆశ్ర‌యించారు.

దీంతో కోర్టు సీరియ‌స్ అయ్యంది మంత్రిపై. తాజాగా తాను డిసెంబ‌ర్ 9 వ‌ర‌కు స‌మీర్ , ఆయ‌న కుటుంబీకుల‌పై ఎలాంటి వ్యాఖ్య‌లు చేయ‌మ‌నని స్ప‌ష్టం చేశారు న‌వాబ్ మాలిక్. బాంబే హైకోర్టు ద్విస‌భ్య ధ‌ర్మాస‌నం తీవ్రంగా హెచ్చ‌రించింది.

ఈ మేర‌కు తాను కోర్టుకు ఈ విష‌యాన్ని తెలియ చేసినట్లు వెల్ల‌డించారు. ఇదిలా ఉండ‌గా మంత్రి న‌వాబ్ మాలిక్( Nawab Malik )త‌మ కుటుంబానికి వ్య‌తిరేకంగా సామాజిక మాధ్య‌మాల్లో చేస్తున్న పోస్టింగ్ ల‌పై స‌మీర్ వాంఖ‌డే తండ్రి ధ్యాన్ దేవ్ వాంఖ‌డే కోటి 25 ల‌క్ష‌ల రూపాయ‌ల ప‌రువు న‌ష్టం దావా వేశారు.

త‌మ‌కు వ్య‌తిరేకంగా మంత్రి న‌వాబ్ మాలిక్(Nawab Malik )జుగుస్సాక‌రంగా, వ్య‌క్తిగ‌తంగా, ప‌రువుకు భంగం క‌లిగించేలా ఉన్నాయ‌ని కోర్టును ఆశ్ర‌యించారు. ఒక కేబినెట్ స్థాయిలో ఉన్న మంత్రి ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం త‌గ‌దు అని పేర్కొన్నారు.

అంతే కాకుండా నోరు పారేసుకోకుండా , త‌మ‌కు వ్య‌తిరేకంగా వ్యాఖ్య‌లు, పోస్టులు చేయ‌కుండా శాశ్వ‌తంగా నిషేధం విధించాల‌ని విన్న‌వించారు.

ఈ పిటిష‌న్ పై విచార‌ణ జ‌రిపిన బాంబే హైకోర్టు సింగిల్ బెంచ్ ధ్యాన్ దేవ్ వాంఖ‌డేకు మ‌ధ్యంత‌ర ఉప‌శ‌మ‌నం ఇచ్చేందుకు నిరాక‌రించంది.

మాట్లాడే, ప్ర‌చురించే హ‌క్కు మాలిక్ కు ఉందంటూ తెలిపింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాల‌ను ధ్యాన్ దేవ్ హైకోర్టు కు తీసుకు వెళ్లారు. దీంతో మాలిక్ దిగి వ‌చ్చారు.

Also Read : ఆప్ ఎంపీతో అఖిలేష్ భేటీv

Leave A Reply

Your Email Id will not be published!