#RakeshTikait : కేంద్ర స‌ర్కార్ ఓ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ

యుద్ధానికి విరామం లేదన్న బీకేయూ నేత

Rakesh Tikait : కేంద్రంలోని మోదీ బీజేపీ సంకీర్ణ స‌ర్కార్ పై నిప్పులు చెరిగారు కిసాన్ సంయుక్త మోర్చా – ఎస్కేఎం నేత రాకేశ్ తికాయ‌త్(Rakesh Tikait). కేంద్రంలో ఉన్న‌ది మోదీ ప్ర‌భుత్వం కాద‌ని అది ఓ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా ఆయ‌న అభివ‌ర్ణించారు.

రైతు వ్య‌తిరేక నిర్ణ‌యాలు తీసుకుంటున్న బీజేపీకి ఎవ‌రూ మ‌ద్ద‌తు ఇవ్వ‌వ‌ద్దంటూ ఆయ‌న కోరారు. బీజేపీకి ఎట్టి ప‌రిస్థితుల్లో ఎస్కేఎం మ‌ద్ద‌తు ఇవ్వ‌ద‌ని తేల్చి చెప్పారు.

హైదరాబాద్ లోని ఇందిరా పార్కు వ‌ద్ద ఆలిండియా రైతు పోరాట స‌మ‌న్వ‌య స‌మితి ఆధ్వ‌ర్యంలో రైతులు ధ‌ర్నా చేప‌ట్టారు. రైతుల ఉద్య‌మానికి ఏడాది పూర్త‌యిన సంద‌ర్భంగా ఈ ధ‌ర్నా చేప‌ట్టారు.

ఈ ధ‌ర్నాకు రాకేశ్ తికాయ‌త్ (Rakesh Tikait) ముఖ్య అతిథిగా హాజ‌రైన ప్ర‌సంగించారు. సాగు చ‌ట్టాల ర‌ద్దు కోరుతూ చేప‌ట్టిన ఆందోళ‌న‌లో మ‌ర‌ణించిన రైతుల‌కు కేంద్రం ప‌రిహారం చెల్లించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

అన్ని రాష్ట్రాలు ముందుకు వ‌చ్చి అన్న‌దాత‌ల‌కు అండ‌గా నిల‌వాల‌ని పిలుపునిచ్చారు. రైతులు పండించే ప్ర‌తీ పంట‌కు క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర క‌ల్పించేలా చ‌ట్టం తీసుకు రావాల‌ని ఆయ‌న కోరారు.

రైతులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి క‌మిటీని ఏర్పాటు చేయాల‌ని రాకేశ్ తికాయ‌త్ డిమాండ్ చేశారు.

విద్యుత్ స‌వ‌ర‌ణ బిల్లు ర‌ద్దుపై ప్ర‌ధాని మోదీ స‌మాధానం చెప్పాల‌ని, విత్త‌న బిల్లు తీసుకు రాకుండా ప్రైవేట్ కంపెనీల‌కు కొమ్ము కాస్తున్నారంటూ ఆరోపించారు.

త‌మ డిమాండ్ల‌ను ఒప్పుకోకుంటే ఉద్య‌మం కొన‌సాగుతుంద‌న్నారు. అదానీ, అంబానీ ఆదేశాల‌తోనే కేంద్ర స‌ర్కార్ న‌డుస్తోంద‌ని ధ్వ‌జ‌మెత్తారు రాకేశ్ తికాయ‌త్.

Also Read : పేద‌ల‌కు వ‌రం ఉచిత రేష‌న్ ప‌థ‌కం

Leave A Reply

Your Email Id will not be published!