#PencilIssue : పెన్సిల్ కోసం ‘పిల్ల‌ల‌’ పంచాయ‌తీ

రాజీ కుదిర్చి పంపిన పోలీసులు

PencilIssue : టెక్నాల‌జీ మారింది. పోలీసుల ప‌ట్ల భ‌యం కూడా పోయింది. అలాగ‌ని గౌర‌వం లేద‌ని కాదు. కానీ పిల్ల‌ల‌కు అర‌మ‌రిక‌లంటూ ఉండ‌వు. వారికి ఈ ప్ర‌పంచ‌మే ఓ లోకం.

పెద్దాయ్యేకా క‌ష్టాలు, క‌ల్మ‌షాలు. అందుకే క‌దా మ‌హాక‌వి శ్రీ‌శ్రీ రాశాడు. వాన కురిస్తే మెరుపు మెరిస్తే అవి మీకేన‌ని ఆనందించే పిల్ల‌ల్లారా కూన‌ల్లారా అని. పిల్ల‌లు విన‌క పోతే టీచ‌ర్ల పేర్లు చెప్పేవారు గ‌తంలో.

భ‌య పెట్టేందుకు ఏవో జంతువుల పేర్లు చెప్పి అన్నం తినిపించే వారు. ప్ర‌స్తుతం ట్రెండ్ మారింది. సినిమాలు అందుబాటులోకి వ‌చ్చాయి. నెట్ క‌నెక్టివిటీ పెరిగాక ఇప్పుడు సోష‌ల్ మీడియా హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

నెట్టింట్లో చిన్నారులు సైతం వైర‌ల్ అవుతున్నారు. ఒక్క రోజులోనే పాపుల‌ర్ అయి పోతున్నారు. తాజాగా ఇద్ద‌రు పిల్ల‌లు చిన్న పెన్సిల్(PencilIssue) కోసం త‌గువు ప‌డ్డారు. చిన్న పోర‌డు ఏకంగా నా పెన్సిల్ ఎందుకు ఇస్త‌లేవు అంటూ ఏకంగా పోలీస్ స్టేష‌న్ కు వెళ్లాడు.

ఈ అరుదైన ఘ‌ట‌న క‌ర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. ఇప్పుడు నెట్టింట్లో వైర‌ల్ గా మారింది. పెద్ద వాళ్లు సైతం పోలీస్ స్టేష‌న్ కు వెళ్లాలంటే భ‌య‌ప‌డతారు. వాళ్ల‌తో మాట్లాడాలంటే జ‌డుసుకుంటారు.

ఈ త‌రుణంలో ఆ పిల్ల‌లు ఏకంగా ఠాణాలో అడుగు పెట్టారు. సార్ వీడు నా పెన్సిల్(PencilIssue) తీసుకుండు. నాకు ఇవ్వమంటే ఇస్త‌లేడు. గుంజుకున్న‌. వీడిపై కేసు పెట్టండి సార్ అని హ‌న్మంతు అనే చిన్నోడు పోలీస్ సార్ కు ఫిర్యాదు చేసిండు.

రోజూ నా పెన్సిళ్లు, పుస్త‌కాలు కూడా తీసుకుంటున్న‌డు కేసు పెట్టండి సార్ అని కోరిండు. చివ‌ర‌కు పోలీసులు స‌ర్ది చెప్పి రాజీ కుదిర్చి పంపించారు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట్లో షేక్ చేస్తోంది.

Also Read : ‘మోదీ, అమిత్ షా’కు సీఎం జ‌గ‌న్ రెడ్డి లేఖ

Leave A Reply

Your Email Id will not be published!