#SanjuSamson : భారీ ధ‌ర‌కు సంజూ శాంస‌న్ సై

రూ. 14 కోట్ల‌కు రాజ‌స్తాన్ రాయ‌ల్స్ కు ఓకే

Sanju Samson : భార‌తీయ క్రికెట్ లో కేర‌ళ‌కు చెందిన సంజూ శాంస‌న్ కు స్పెష‌ల్ ఇమేజ్ ఉంది. టీమిండియాకు ప్రాతినిధ్యం వ‌హించినా ఇప్పుడు దేశీవాళి, ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ కే ప‌రిమితం అయ్యాడు.

వ‌చ్చే ఏడాది అంటే 2022 సంవ‌త్స‌రంలో జ‌రిగే ఐపీఎల్ మెగా వేలంకు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతోంది. దీంతో ఆయా ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకునే ప్లేయ‌ర్ల లిస్టును సిద్దం చేసుకుంటున్నాయి.

తాము ఎంపిక చేసుకున్న ఆట‌గాళ్ల పేర్ల‌తో కూడిన జాబితాను ఆయా జ‌ట్లు ఈనెల 30 లోపు అంద‌జేయాల్సి ఉంటుంది. ఇదిలా ఉండ‌గా క్రికెట్ వ‌ర్గాల నుంచి అందిన స‌మాచారం మేర‌కు స్టార్ ప్లేయ‌ర్ సంజూ శాంస‌న్ (Sanju Samson)రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కు ఆడ‌నున్నారు.

ఇప్ప‌టికే సంజూ ఆర్ఆర్ ను వ‌దిలి పెడ‌తాడ‌ని, మ‌హేంద్ర సింగ్ ధోనీ నాయ‌క‌త్వంలోని చెన్నై సూప‌ర్ కింగ్స్ కు వెళ‌త‌డాని జోరుగా ప్ర‌చారం జ‌రిగింది.

అయితే రాజ‌స్థాన్ రాయ‌ల్స్ మేనేజ్ మెంట్ డైరెక్ట‌ర్ , మాజీ క్రికెట్ దిగ్గ‌జం శ్రీ‌లంక‌కు చెందిన కుమార సంగ‌క్క‌ర శాంస‌న్(Sanju Samson) అయితే బెట‌ర్ అని సూచించిన‌ట్లు టాక్.

గ‌తంలో స‌ద‌రు మేనేజ్ మెంట్ రూ. 8 కోట్ల‌కు సంజూతో ఒప్పందం చేసుకుంటే ఈసారి అద‌నంగా మ‌రో ఆరు కోట్లు పెంచి రూ. 14 కోట్ల‌కు ఓకే చెప్పిన‌ట్లు స‌మాచారం.

ఇక శాంస‌న్ తో పాటు స్టార్ బ్యాట‌ర్ బ‌ట్ల‌ర్, జోఫ్రా ఆర్చ‌ర్ , య‌శ‌స్వి జైస్వాల్ , లివింగ్ స్టోన్ ల‌ను కూడా ఓన్ చేసుకోనుంది. ఇదిలా ఉండ‌గా 14వ ఐపీఎల్ సీజ‌న్ లో సంజూ 484 ప‌రుగుల‌తో రాణించాడు. కానీ మిగ‌తా ఆట‌గాళ్లు స‌క్సెస్ కాలేక పోయారు.

Also Read : ప్ర‌తిసారీ ర‌న్స్ చేయాలంటే క‌ష్టం

Leave A Reply

Your Email Id will not be published!