#YSSharmila : కేసీఆర్ పాల‌న‌లో ర‌క్ష‌ణ క‌రువు – ష‌ర్మిల‌

బాధిత కుటుంబానికి రూ.10 కోట్లు ఇవ్వాలి

YS Sharmila : తెలుగు రాష్ట్రాల‌లో పెను సంచ‌ల‌నం సృష్టించిన సైదాబాద్ చిన్నారి బాధిత కుటుంబాన్ని ప‌రామ‌ర్శించే వాళ్ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. గ‌డీల పాల‌న‌లో హింస పేట్రేగి పోతోంద‌ని, మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోయింద‌ని ఆరోప‌ణ‌లు వెళ్లువెత్తుతున్నాయి.

ఇవాళ బాధిత ఫ్యామిలీని తెలంగాణ వైఎస్సార్సీపీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల(YS Sharmila) సంద‌ర్శించి ప‌రామ‌ర్శించారు.

ఆ కుటుంబానికి భ‌రోసా ఇచ్చారు. బాధితురాలి ఇంటి వ‌ద్ద ఆమె నిరాహార‌దీక్ష చేప‌ట్టారు.

సీఎం కేసీఆర్ స్పందించేంత దాకా తాను దీక్ష చేప‌డ‌తాన‌ని హెచ్చ‌రించారు. ఈ సంద‌ర్భంగా వైఎస్ ష‌ర్మిల ప్ర‌సంగించారు. చిన్నారిని కోల్పోవ‌డం బాధాక‌ర‌మ‌న్నారు.

అస‌లు మ‌నం ఈ స‌మాజంలోనే ఉన్నామా అన్న అనుమానం క‌లుగుతోంద‌న్నారు.

ఈ సంద‌ర్భంగా బాధిత కుటుంబానికి రూ. 10 కోట్ల రూపాయ‌ల ప‌రిహారం ఇవ్వాల‌ని ష‌ర్మిల(YS Sharmila) డిమాండ్ చేశారు.

ఎన్న‌డూ లేని రీతిలో తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వ హ‌యాంలో మ‌హిళ‌ల‌పై లైంగిక దాడులు పెరిగాయ‌ని ఈరోజు దాకా స్పందించిక పోవ‌డంపై ఆమె మండిప‌డ్డారు.

ఈ ఘ‌ట‌న‌పై కేసీఆర్ ఈరోజు దాకా మాట్లాడ‌క పోవ‌డం పూర్తి బాధ్య‌తా రాహిత్యాన్ని సూచిస్తోంద‌ని ధ్వ‌జ‌మెత్తారు ష‌ర్మిల‌.

దారుణం జ‌రిగి ఇన్ని రోజులు అవుతున్నా ఇప్ప‌టి దాకా నిందితుడిని ప‌ట్టుకోలేద‌ని ప్ర‌శ్నించారు.

ఒక ర‌కంగా చూస్తే అస‌లు రాష్ట్రంలో పాల‌న అనేది ఉందా అన్న అనుమానం క‌లుగుతోంద‌న్నారు. ఇప్ప‌టికైనా ప‌ట్టుకుని ఇలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం జ‌ర‌గ‌కుండా చూడాల‌ని సూచించారు. బాధిత కుటుంబానికి త‌మ పార్టీ అండ‌గా ఉంటుంద‌ని ష‌ర్మిల స్ప‌ష్టం చేశారు.

Also Read : నిమజ్జ‌నంపై టీఎస్ స‌ర్కార్ కు షాక్

No comment allowed please

error: TeluguISM content is copyright protected! Reproducing it in any form is subject to penalization!!!